తెలుగు సాహిత్యాభివృద్ధి కోసం మీ అందరికీ ఆహ్వానం!
సాహిత్య కలశం గురించి
సాహిత్య కలశం, తెలుగులో రచనలు చేస్తూ, ఆమడ దూరంలో ఉన్న రచయతల, కవుల రచనలు పాఠకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఒక మంచి వేదికగా ఏర్పాటు చేయబడింది. సాహిత్య లోకంలో పెనుమార్పులు అచ్చు యంత్రాల ఆవిష్కరణతో పాటు డిజిటల్ యుగంలో అడుగుపెట్టాక, అచ్చు ద్వారా ప్రచురించని ఎన్నో రచనలు కనుమరుగయ్యాయి. అంతర్జాలంలో స్థిరమైన డిజిటల్ ఉనికిని పొందని రచయతలు మరియు వారి రచనలు కూడా మరుగున పడుతున్నాయి.

రచనలు ఆధునిక మాధ్యమం
తెలుగు పుస్తకాల పట్టిక 2,00,000
పుస్తకాలను మించి ఉంది.
– ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు
‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ పుస్తకం 1,00,000
కాపీలకు పైగా అమ్ముడైంది.
– శ్రీ రవి మంత్రిప్రగడ గారు
ఈ రోజుల్లో 2,00,000 పుస్తకాలు
పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
– శ్రీ కాళీపట్నం రామారావు గారు
ఈ సమాచారం ఆధారంగా, తెలుగులో లక్షల మంది పాఠకులు ఉన్నారు. వేలల్లో రచయతలు, లక్షలలో పాఠకులు ఉన్నారు. అందరి రచనలు ఆధునిక మాధ్యమం లో అందుబాటులోకి వస్తే పాఠకుల ఆదరణ మరింతగా పెరుగుతుందని తెలుస్తోంది.
ప్రణాళిక
- మీరు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకుంటే, మీ రచనలను మా వేదికపై ప్రదర్శించడానికి సంతోషంగా స్వాగతిస్తాము.
- మీరు రాసిన కథలు, కవితలు, లేదా ఇతర సాహిత్య రచనలను పాఠకులకిచ్చేందుకు మా కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి.
- మీ రచనలను గౌరవంగా నిలబెట్టి, తెలుగు సాహిత్యాన్ని విస్తరించడంలో మీకు సహకరిస్తాము.
తెలుగు సాహిత్యానికి కొత్త గమనం – సాహిత్య కలశం!
మీ కథల రసజ్ఞత, మీ కవిత్వ మాధుర్యం మరుగున పడనీయకండి!
ఈ వేదికపై మీ అభిప్రాయం తెలిజేయండి !